జనతా కర్ఫ్యూను 14 రోజులు పెట్టాలి
ABN , First Publish Date - 2020-03-24T09:06:59+05:30 IST
దేశంలో కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే జనతా కర్ఫ్యూను కనీసం 14 రోజులు అమలు చేయాలని...

అప్పుడే వైరస్ కట్టడి.. మోదీకి దేశ్‌ముఖ్ విజ్ఞప్తి
ముంబై, మార్చి 23: దేశంలో కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే జనతా కర్ఫ్యూను కనీసం 14 రోజులు అమలు చేయాలని భారత మైక్రో బయాలజిస్టుల సంఘం(ఎంఎస్‌ఐ) అధ్యక్షుడు ఏఎమ్ దేశ్‌ముఖ్ అభిప్రాయపడ్డారు. అలా చేస్తే వైరస్ సోకిన వారి లక్షణాలు బయటపడతాయని, వారిని ఆస్పత్రుల్లో చేర్చి వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశా రు. చాలా మంది సామాజిక దూరాన్ని జోక్‌గా తీసుకుంటున్నారని, ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన చెందారు.