వీఐపీ అన్న అహం పనికిరాదు

ABN , First Publish Date - 2020-03-23T06:06:09+05:30 IST

కరోనా వైరస్‌ మనకు చాలా పాఠాలు నేర్పుతోంది. జనతా కర్ఫ్యూ కులం, మతం, పేద, గొప్ప, సెలబ్రిటీ అనే తేడా లేకుండా దేశం మొత్తాన్ని ఒక్క మాటపై నిలబెట్టింది..

వీఐపీ అన్న అహం పనికిరాదు

  • కరోనా ముందు ఇవేమీ చెల్లవ్‌!

కరోనా వైరస్‌ మనకు చాలా పాఠాలు నేర్పుతోంది. జనతా కర్ఫ్యూ కులం, మతం, పేద, గొప్ప, సెలబ్రిటీ అనే తేడా లేకుండా దేశం మొత్తాన్ని ఒక్క మాటపై నిలబెట్టింది. ఒక్క బాటలో నడిపింది. ఈ వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తూ, మానవ జాతికి అత్యంత ప్రమాదకర పరిస్థితులను కల్పిస్తున్నా కొందరిలో వీఐపీ అనే అహం చావడంలేదు. కానీ కరోనా వద్ద అవన్నీ చెల్లవు. దానికి  ఎవరైనా ఒక్కటే. విదేశాల నుంచి వచ్చినప్పటికీ అటు ప్రభుత్వ, ఇటు స్వీయ క్వారంటైన్‌, సామాజిక దూరం వంటి జాగ్రత్తలను పాటించాలన్న జ్ఞానంలేకుండా కొందరు వీఐపీలు ప్రవర్తిస్తున్నారు. దాంతో వారు వైరస్‌ వ్యాప్తికి కారకులవుతున్నారు.  అయితే అందరినీ అలా అనలేం. కొందరు వీఐపీలు నియమనిబంధనలు పాటిస్తూ, స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు.  ఇటీవల ప్రముఖ బాలీవుడ్‌ గాయని కనికా కపూర్‌  లండన్‌ నుంచి వచ్చారు. ఆమె స్వీయ క్వారంటైన్‌ పాటించలేదు. వీఐపీలు పాల్గొనే ఒక పార్టీలో కూడా పాల్గొన్నారు. ఆ తరువాత ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. లక్నో ఆస్పత్రిలో చేరిన తరువాత కూడా ఆమెకు సెలబ్రిటీ అన్న జాఢ్యం వదలలేదు.  ఆస్పత్రిలో తనకు సరైన సౌకర్యాలు లేవని, సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. సదరు గాయని ఓ స్టార్‌లా కాకుండా కరోనా పేషెంట్‌లా ప్రవర్తించడం నేర్చుకోవాలని ఆ ఆస్పత్రి వైద్యులు సూచించారు. ఆమెకు ఉత్తమమైన సౌకర్యాలు కల్పించామని, బెడ్‌, టెలివిజన్‌, టాయిలెట్‌తో ఉన్న ఓ ఐసోలేటెడ్‌ రూమ్‌ కేటాయించి గ్లూటెన్‌ ఫ్రీ డైట్‌ను అందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి వీఐపీలు తమ ధోరణిని మార్చుకోవలసిన అవసరం ఉంది. అయితే వీఐపీలలో అనేక మంది సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నారు.  

Updated Date - 2020-03-23T06:06:09+05:30 IST