జమ్మూకాశ్మీర్ లో 1071 మందికి కరోనా పరీక్షలు.. అందులో పాజిటివ్ కేసులు..

ABN , First Publish Date - 2020-04-26T00:01:49+05:30 IST

జమ్మూకాశ్మీర్ లో కొత్తగా శనివారం మరో 40 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

జమ్మూకాశ్మీర్ లో 1071 మందికి కరోనా పరీక్షలు.. అందులో పాజిటివ్ కేసులు..

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో కొత్తగా శనివారం మరో 40 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1071 మంది కరోనా పరీక్షలు చేయగా.. అందులో 40 మందికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వల్ల 6 మంది చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జమ్మూలో 57 కరోనా వైరస్ కేసులు నమోదవగా.. కాశ్మీర్ లో 437 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 494 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించినట్లు ప్రకటించింది.


Updated Date - 2020-04-26T00:01:49+05:30 IST