జామియా విద్యార్థికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ABN , First Publish Date - 2020-04-16T00:51:33+05:30 IST

జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విద్యార్థికి ఢిల్లీ కోర్టు బుధవారం

జామియా విద్యార్థికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

న్యూఢిల్లీ : జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విద్యార్థికి ఢిల్లీ కోర్టు బుధవారం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈశాన్య ఢిల్లీలో హింసను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపిస్తూ ఆ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. 


ఆ విద్యార్థిని బుధవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రోహిత్ గులియా సమక్షంలో పోలీసులు హాజరుపరిచారు. ఆయనకు గతంలో విధించిన 9 రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపరిచారు. 


ఆ విద్యార్థి ఆర్జేడీ ఢిల్లీ యువజన విభాగం అధ్యక్షుడు. ఆయనను ఈ నెల 2న అరెస్టు చేశారు. ఆ మర్నాడు ఆయనను మూడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. 


ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన హింసాకాండలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ, ఓ హెడ్ కానిస్టేబుల్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనల్లో మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు.


Updated Date - 2020-04-16T00:51:33+05:30 IST