షాకింగ్: 8 రోజులు పాటు బాత్‌రూంలోనే కరోనా మృతదేహం..!
ABN , First Publish Date - 2020-06-18T18:08:14+05:30 IST
మహారాష్ట్రలోని జల్‌గావ్ సివిల్ ఆస్పత్రి బాత్‌రూంలో కరోనా రోగి మృతి దేహం లభించిన ఘటనలో ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు షాకిచ్చింది.
జల్‌గావ్: మహారాష్ట్రలోని జల్‌గావ్ సివిల్ ఆస్పత్రి బాత్‌రూంలో కరోనా రోగి మృతి దేహం లభించిన ఘటనలో ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు షాకిచ్చింది. ఆయనకు స్థాన చలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఘటన జరిగిన వారం తరువాత ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది. కాగా..బాత్‌రూంలో కరోనాతో మరణించిన వృద్ధుడి మృతం దేహం లభించడం ఆ సమయంలో పెద్ద కలకలానికి దారితీసింది. ఎనిమిది రోజుల పాటు మృతదేహాన్ని ఎవరూ గమనించకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆస్పత్రి యాజమాన్యం మాత్రం కరోనా రోగి కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆస్పత్రి వాష్‌రూంలోనే మృత దేహం అభించడంతో పెను దుమారమే చెలరేగింది. దీంతో జిల్లా కలెక్టర్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.