గ్రామమే లేదు.. కానీ తాగునీటి పైప్‌లైన్ వేశారు..
ABN , First Publish Date - 2020-11-21T11:55:18+05:30 IST
కేంద్రప్రభుత్వ ‘జల్ జీవన్’ పథకంలో కాంచీపురం జిల్లాలో గ్రామమే లేకండానే పైప్‌లైన్ ఏర్పాటు చేయడం వెలుగు చూసింది. దేశంలోని ప్రతి గ్రామంలో ఉన్న ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు అందించేలా జల్ జీవన్ పథకం అమలవుతోంది. ఈ పథకంలో కాంచీపురం జిల్లాకు రూ.185 కోట్లు మంజూరయ్యాయి.

చెన్నై : కేంద్రప్రభుత్వ ‘జల్ జీవన్’ పథకంలో కాంచీపురం జిల్లాలో గ్రామమే లేకండానే పైప్‌లైన్ ఏర్పాటు చేయడం వెలుగు చూసింది. దేశంలోని ప్రతి గ్రామంలో ఉన్న ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు అందించేలా జల్ జీవన్ పథకం అమలవుతోంది. ఈ పథకంలో కాంచీపురం జిల్లాకు రూ.185 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలోని వాలజాబాద్, ఉత్తరమేరూర్, శ్రీపెరుంబుదూర్, కాంచీపురం, కుండ్రత్తూర్ యూనియన్లలోని 274 పంచాయతీల్లో 1,354 గ్రామాల్లో ఈ పథకం అమలవుతోంది. వాలాజాబాద్ యూనియన్ విల్లివలం పంచాయతీలో పెండై అనే గ్రామానికి కాలనీ లేదు. అయితే పెండై గ్రామంలో కాలనీ ఉన్నట్లు చూపి రూ.87 వేలతో పైప్‌లైన్ అమర్చినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ... జల్ జీవన్ పథకం కింద పలు ప్రాంతాల్లో ఇళ్లు లేకుండానే పైప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొని నిధులు స్వాహా చేశారని చెప్పారు. ఈ పథకంలో రాజకీయనేతల జోక్యం అధికంగా ఉందని, 7 నుంచి 12 శాతం వరకు కాంట్రాక్టర్ల నుంచి నేతలు కమీషన్ పొందుతున్నారని, దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని కోరుతున్నారు.