జైషే కమాండర్‌ ఫాజీబాబా ఎన్‌కౌంటర్‌

ABN , First Publish Date - 2020-06-04T07:04:28+05:30 IST

కశ్మీర్‌లో జైష్‌-ఏ-మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా, కంగన్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ సంస్థ కమాండర్‌ అబ్దుల్‌ రెహమాన్‌ అలియాస్‌ ఫాజీ భాయ్‌ అలియాస్‌ ఫాజీ బాబా సహా ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు మట్టుబెట్టాయి...

జైషే కమాండర్‌ ఫాజీబాబా ఎన్‌కౌంటర్‌

  • ఉగ్ర సంస్థ చీఫ్‌ మసూద్‌ అజార్‌కు బంధువు


శ్రీనగర్‌, జూన్‌ 3: కశ్మీర్‌లో జైష్‌-ఏ-మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా, కంగన్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆ సంస్థ కమాండర్‌ అబ్దుల్‌ రెహమాన్‌ అలియాస్‌ ఫాజీ భాయ్‌ అలియాస్‌ ఫాజీ బాబా సహా ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు మట్టుబెట్టాయి. వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భారీఎత్తున స్వాధీనం చేసుకున్నాయి. కశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎ్‌ఫతో కలిసి భద్రతా దళాలు బుధవారం సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాయి. బాంబుల తయారీలో నిపుణుడైన ఫాజీబాబా.. పాకిస్థాన్‌లోని ముల్తాన్‌ వాసి. అతడు జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌కు దగ్గరి బంధువు. ఫాజీబాబా 2017 నుంచి కశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని, అతణ్ని హతమార్చడం భారత దళాల అతిపెద్ద విజయమని ఐజీ విజయ్‌ కుమార్‌ అన్నారు. మే 28న పేలుడు పదార్థాలతో వెళుతున్న కారును భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నప్పుడు ఇతడు త్రుటిలో తప్పించుకున్నాడన్నారు.  


Updated Date - 2020-06-04T07:04:28+05:30 IST