పరువునష్టం కేసులో జైరాం రమేశ్‌ క్షమాపణ

ABN , First Publish Date - 2020-12-20T08:50:34+05:30 IST

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌ తనయుడు వివేక్‌ దోబాల్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ క్షమాపణలు తెలిపారు.

పరువునష్టం కేసులో జైరాం రమేశ్‌ క్షమాపణ

కేసు ఉపసంహరించుకున్న అజిత్‌ దోబాల్‌ తనయుడు


న్యూఢిల్లీ, డిసెంబరు 19: జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌ తనయుడు వివేక్‌ దోబాల్‌కు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ క్షమాపణలు తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో ఒక మ్యాగజిన్‌లో  ప్రచురితమైన కథనం ఆధారంగా.. వివేక్‌తోపాటు ఆయన కుటుంబికులపై జైరాం తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో జైరాంపై వివేక్‌.. కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో.. క్షణికావేశంలో ఆరోపణలు చేశానని, ఒక కథనం ఆధారంగా నిజనిజాలు నిర్ధారించుకోకుండా నిందలు వేశానని కోర్టులో లిఖితపూర్వకంగా జైరాం క్షమాపణ కోరారు. కాంగ్రెస్‌ వెబ్‌సైటులో దీనికి సంబంధించి ఉన్న కథనాలను కూడా తొలగించాలని ఆ పార్టీకి తెలిపానని పేర్కొన్నారు. దీంతో కేసును వివేక్‌ ఉపసంహరించుకున్నారు. 

Updated Date - 2020-12-20T08:50:34+05:30 IST