రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌కు బీజేపీ ఝలక్‌

ABN , First Publish Date - 2020-12-11T08:16:11+05:30 IST

రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ ఝలక్కిచ్చింది. 20 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగ్గా..

రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌కు బీజేపీ ఝలక్‌

12 జిల్లా పరిషత్‌లు కైవసం.. కాంగ్రెస్‌కు 5


జైపూర్‌, డిసెంబరు 10: రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్‌ పార్టీకి బీజేపీ ఝలక్కిచ్చింది. 20 జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు జరగ్గా.. జైసల్మేర్‌, ఉదయ్‌పూర్‌లతోసహా 12 స్థానాల్లో జిల్లా పరిషత్‌ అధ్యక్షులుగా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్‌ 5 స్థానాలతో సరిపెట్టుకోగా.. 3 స్థానాల్లో స్వతంత్రులు నెగ్గారు. ఝలావర్‌ జిల్లా పరిషత్‌కు శుక్రవారం(11న) ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 221 పంచాయితీలకు కూడా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించారు. అయితే, పార్టీల వారీగా గెలుపోటముల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 

Updated Date - 2020-12-11T08:16:11+05:30 IST