సాయిబాబకు మంకీ క్యాప్, టీ షర్టు నిరాకరణ
ABN , First Publish Date - 2020-12-28T07:51:48+05:30 IST
నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబకు అక్కడి అధికారులు ఉన్ని టోపీ (మంకీక్యాప్), టీ-షర్టును అందజేసేందుకు కూడా నిరాకరించారని ఆయన తరఫు న్యాయవాది ఆకాశ్ సరోదే ఆరోపించారు...

నాగ్‌పూర్, డిసెంబరు 27: నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబకు అక్కడి అధికారులు ఉన్ని టోపీ (మంకీక్యాప్), టీ-షర్టును అందజేసేందుకు కూడా నిరాకరించారని ఆయన తరఫు న్యాయవాది ఆకాశ్ సరోదే ఆరోపించారు. నెలక్రితం సాయిబాబ తనకు అవసరమైన 34 వస్తువులను జాబితా రూపంలో జైలు అధికారులకు ఇచ్చారని, అందులో 13 వస్తువులను మాత్రమే జైలు అధికారులు లోపలికి అనుమతిచ్చారని తెలిపారు. సాయిబాబ కోరిన వస్తువులను ఆయన కుటుంబ సభ్యులు ఇవ్వగా వాటిని తీసుకొని ఈనెల 24న తాను జైలుకు వెళ్లానని.. అయితే అక్కడ చాలా వస్తువులను తీసుకునేందుకు జైలు అధికారులు తిరస్కరించారని ఆకాశ్ చెప్పారు.