కరోనా పాజిటివ్ వచ్చిందని ఆసుపత్రిలో యువకుని వీరంగం

ABN , First Publish Date - 2020-10-14T15:04:49+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలోని జగత్‌పురిలో కరోనా పాజిటివ్ వచ్చిన ఒక యువకుడు ఆసుపత్రిలోని వైద్యునితో పాటు సిబ్బందిపై దాడి చేశాడు. దీనిని గమనించిన అక్కడున్నవారు...

కరోనా పాజిటివ్ వచ్చిందని ఆసుపత్రిలో యువకుని వీరంగం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని జగత్‌పురిలో కరోనా పాజిటివ్ వచ్చిన ఒక యువకుడు ఆసుపత్రిలోని వైద్యునితో పాటు సిబ్బందిపై దాడి చేశాడు. దీనిని గమనించిన అక్కడున్నవారు వైద్యుడిని, సిబ్బందిని కాపాడారు. బాధిత వైద్యుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జగత్‌పురి డిస్పెన్సరీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ రీనా సహగల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం షానూ అనే యువకుడు కరోనా టెస్టు చేయించుకునేందుకు ఆసుపత్రికి వచ్చాడని తెలిపారు. అతనికి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా, కరోనా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. దీంతో ఆ యువకుడు తనతో పాటు కొంతమందిని ఆసుపత్రికి తీసుకువచ్చి, తమపై దాడి చేశాడని ఆరోపించారు. కాగా ఆ యువకుడు తనకు ఆసుపత్రిలో తప్పుడు రిపోర్టు ఇచ్చారని ఆరోపిస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-10-14T15:04:49+05:30 IST