పూరీ వాసులకు జగన్నాథుడి దర్శనం
ABN , First Publish Date - 2020-12-27T09:55:36+05:30 IST
పూరీ వాసులకు జగన్నాథుడి దర్శనం

పూరీ, డిసెంబరు 26: పూరీ జగన్నాథుడిని దర్శించుకునేందుకు స్థానిక భక్తులకు ఆలయ నిర్వహణ కమిటీ అవకాశం కల్పించింది. స్థానిక భక్తుల కోసం ఆలయాన్ని శనివారం పునఃప్రారంభించింది. కొవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ భక్తులకు ఆలయంలో ప్రవేశం కల్పించింది. కాగా ఆలయ పూజారులు, సేవకుల కోసం ఈనెల 23న ఆలయాన్ని పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే జాజ్‌పూర్‌లో విరాజ్ దేవి ఆలయాన్ని కూడా ఈనెల 29న పునఃప్రారంభించనున్నారు. జిల్లాలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో విరాజ్ దేవి ఆలయాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించామని జిల్లా కలెక్టర్ చక్రవర్తి సింగ్ తెలిపారు.