కరోనా కలకలం: అమెరికాకు చైనా బిలియనీర్ చేయూత

ABN , First Publish Date - 2020-03-16T23:02:12+05:30 IST

కరోనా వైరస్‌తో పోరాడుతున్న అమెరికాకు చేయూత నిచ్చేందుకు చైనా బిలియనీర్, అలీబాబా అధినేత జాక్ మా.. కరోనా టెస్టు కిట్లు, మాస్కులను అమెరికాకు పంపిస్తున్నట్టు ప్రకటించారు.

కరోనా కలకలం: అమెరికాకు చైనా బిలియనీర్ చేయూత

బీజింగ్: కరోనా వైరస్‌తో పోరాడుతున్న అమెరికాకు చేయూత నిచ్చేందుకు చైనా బిలియనీర్, అలీబాబా అధినేత జాక్ మా.. కరోనా టెస్టు కిట్లు, మాస్కులను అమెరికాకు పంపిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. టెస్టు కిట్లు, మాస్కులతో ఉన్న విమానం ఫోటోను కూడా జత చేశారు. ‘అమెరికాలోని మిత్రులకు ఆల్ ది బెస్ట్’ అని కూడా వ్యాఖ్యానించారు. కాగా.. అలీబాబా ఫౌండేషన్ గతంలో జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాలకు ఇలాంటి సహాయం చేసింది.  అమెరికాకు కూడా చేయూత నిస్తామని శుక్రవారం నాడు ప్రకటించింది. ఇందుకు సంబంధించి.. 5 లక్షల కరోనా పరీక్షల కిట్లు, 10 లక్షల మాస్కులు సిద్దం చేస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా వాటిని అమెరికాకు పంపిస్తూ జాక్ మా ట్వీట్ చేశారు. కరోనాపై యుద్ధంలో తమ వంతు పాత్ర పోషిస్తామంటూ ముందుకు వచ్చిన ప్రపంచ కుబేరుల్లో జాక్ మా కూడా ఒకరన్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కరోనా కట్టడికి ఇతోధిక సాయం చేస్తున్నారు. 

Updated Date - 2020-03-16T23:02:12+05:30 IST