ఇవాంక ట్రంప్.. పక్కన నేను!
ABN , First Publish Date - 2020-03-02T08:13:12+05:30 IST
సెలబ్రిటీల ఫొటోలను ఫొటోషా్‌పలో మార్ఫ్ చేసి వాళ్లు తమ పక్కనే ఉన్నట్లు మార్చుకునేవారెందరో..! సాధారణంగా సెలబ్రిటీలు వాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముద్దుల పట్టి ఇవాంక ట్రంప్ మాత్రం సానుకూలంగా...

సెలబ్రిటీల ఫొటోలను ఫొటోషా్‌పలో మార్ఫ్ చేసి వాళ్లు తమ పక్కనే ఉన్నట్లు మార్చుకునేవారెందరో..! సాధారణంగా సెలబ్రిటీలు వాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముద్దుల పట్టి ఇవాంక ట్రంప్ మాత్రం సానుకూలంగా స్పందించారు. ప్రఖ్యాత గాయకుడు దిల్జీత్ దొసాంజా కూడా మార్ఫింగ్‌కు అతీతమేం కాదు..! ఇవాంక తాజ్‌మహల్ ముందు తన భర్తతో కలిసి దిగిన ఫొటోను ఆయన మార్ఫ్ చేశారు. ఇవాంకపై కాళ్లు వేసినట్లుగా ఫొటోషా్‌పలో మార్చి ట్విటర్‌లో పెట్టారు.
‘అది ఫొటోషాప్ మాయ’ అని చాలా మంది విమర్శించినా ఇవాంక మాత్రం ‘‘ధన్యవాదాలు. నన్ను ఓ అద్భుత కట్టడం వద్దకు తీసుకెళ్లి చూపించినందుకు’’ అని బదులిచ్చారు. ఇవాంక తన సైకిల్ వెనుక కూర్చున్నట్లు ఓ కుర్రాడు మార్చేశాడు. చాలా మంది కుర్రాళ్లు తాజ్‌మహల్ వద్ద ఇవాంక పక్కన తామే ఉన్నట్లు మార్ఫింగ్ చేశా రు. ‘‘భారత్‌లో నాకు మిత్రులు పెరిగారు’’ అంటూ ఇవాంక స్పందించారు.