దురదృష్టమే కానీ.. ఆ నిర్ణయంపై భారత పేసర్ బుమ్రా కామెంట్స్!

ABN , First Publish Date - 2020-12-27T07:21:16+05:30 IST

ఆసీస్-భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టులో తన అద్భుతమైన ప్రదర్శనతో ఆసీస్ జట్టును ఆలౌట్ చేయడంలో భారత మిస్టరీ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పాత్ర చాలానే ఉంది

దురదృష్టమే కానీ.. ఆ నిర్ణయంపై భారత పేసర్ బుమ్రా కామెంట్స్!

మెల్‌బోర్న్: ఆసీస్-భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టులో తన అద్భుతమైన ప్రదర్శనతో ఆసీస్ జట్టును ఆలౌట్ చేయడంలో భారత మిస్టరీ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పాత్ర చాలానే ఉంది. ఆసీస్ తొలి ఇన్నింగ్సులో బుమ్రా ఒక్కడే నాలుగు వికెట్లు పడగొట్టాడు. అయితే ఇలాంటి అంతర్జాతీయ మ్యాచుల్లో అఫీషియల్ అంపైర్లు లేకపోవడం వివాదాస్పదం అయింది. అయితే కరోనా కాలంలో అంపైర్లకు ట్రావెల్ సౌకర్యం కల్పించలేదు. దీనిపై స్పందించిన బుమ్రా..‘‘ఇలా అంపైర్ల ట్రావెలింగ్‌పై నిషేధం ఉండటం నిజంగా దురదృష్టం. అయిత ఈ విషయంలో మనమేం చేయలేం. ఇలా మన చేతుల్లో లేని అంశాలను పట్టించుకునే కన్నా.. మనం చేయగలిగే పనులపై దృష్టి పెట్టడం మేలు’’ అని బుమ్రా అన్నాడు.

Updated Date - 2020-12-27T07:21:16+05:30 IST