ఐటీ రిటర్న్ దాఖలు గడుపు పొడిగింపు
ABN , First Publish Date - 2020-12-31T00:54:20+05:30 IST
వ్యక్తిగత ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువును మరోసారి ప్రభుత్వం పొడిగించింది. 2019-20..

న్యూఢిల్లీ: వ్యక్తిగత ఐటీ రిటర్న్‌ల దాఖలు గడువును మరోసారి ప్రభుత్వం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్ను రిటర్న్‌ల (ఐటీఆర్) గడువును డిసెంబర్ 31 నుంచి 2021 జనవరి 10వ తేదీ వరకూ పొడిగించింది. అకౌంట్ల ఆడిట్ అవసరం లేని, సహజంగా ఐటీర్-1, ఐటీఆర్-4 ఫార్మ్స్ ద్వారా రిటర్న్‌లు దాఖలు చేసే వారికి ఈ పొడిగింపు వర్తిస్తుందని ఆదాయం పన్ను శాఖ బుధవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ కారణంగా పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా ఈ గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అలాగే, జీఎస్‌టీ కింద 2020 ఆర్థిక సంవత్సరం కింద వార్షిక రిటర్న్‌ల దాఖలు గడువును కూడా 2021 ఫిబ్రవరి 28 వరకూ పొడిగించారు.