కరోనా కల్లోలంలో.. గ్రామీణ పేదలకు అండగా ఐటీసీ

ABN , First Publish Date - 2020-07-09T00:39:12+05:30 IST

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.

కరోనా కల్లోలంలో.. గ్రామీణ పేదలకు అండగా ఐటీసీ

న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యంగా గ్రామీణ కూలీలు, రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి వారికి అండగా ఉండాలని ఐటీసీ సంస్థ నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన ఎంజీఎన్ఆర్ఈజీ పథకాన్ని దీనికోసం ఉపయోగిస్తోంది. వ్యవసాయం, దాని ఆధారిత కార్యకలాపాలపై నిబంధనలు సడలించిన వెంటనే  ఐటీసీ సంస్థ రంగంలోకి దిగింది. తాలూకా స్థాయిలోని అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపింది. కష్టాల్లో ఉన్న రైతులు, కూలీలకు ఎంప్లాయిమెంట్ కార్డులు వచ్చేలా చూసింది. వీరందరికీ ఎంజీఎన్ఆర్ఈజీ పథకం కింద ఉద్యోగాలు దొరికేలా చర్యలు తీసుకుంది. అలాగే వీరి భద్రత కోసం తగిన జాగ్రత్తలు పాటిస్తోంది. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రజలకు తన వంతు సాయం చేస్తూ వచ్చిన ఐటీసీ సంస్థ ఇప్పుడు గ్రామీణ రైతులు, కూలీల కోసం ఈ భారీ యోచన చేసింది. గ్రామీణ పేదల ఆర్థిక స్థితిని మెరుగు పరిచేందుకు ప్రభుత్వ పథకాలతోపాటు ఎన్జీవోల సహకారాన్ని కూడా ఐటీసీ తీసుకుంటోంది. ‘నేషన్ ఫస్ట్’ అనే ఐటీసీ నినాదానికి న్యాయం చేయడంలో భాగంగానే తాము ఈ చర్యలు చేపడుతున్నట్లు ఐటీసీ అగ్రి బిజినెస్ గ్రూప్ హెడ్ ఎస్ శివకుమార్ తెలిపారు.

Updated Date - 2020-07-09T00:39:12+05:30 IST