లాక్‌డౌన్ ఎత్తివేతకు ఇటలీ రంగం సిద్ధం

ABN , First Publish Date - 2020-04-26T03:08:13+05:30 IST

యూరప్‌లోనే అత్యంత బాధిత దేశంగా మారిన ఇటలీలో మే 4 నుంచి లాక్‌డౌన్ నిబంధనలు సడలించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు

లాక్‌డౌన్ ఎత్తివేతకు ఇటలీ రంగం సిద్ధం

రోమ్: యూరప్‌లోనే అత్యంత బాధిత దేశంగా మారిన ఇటలీలో మే 4 నుంచి లాక్‌డౌన్ నిబంధనలు సడలించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. అత్యంత బాధిత ప్రాంతాలుగా మారిన నర్సింగ్ హోంలకు ఉచితంగా మాస్కులు పంచాలని యోచిస్తోంది. అలాగే, ప్రభుత్వాధికారులు, రవాణా కార్మికులు, పోలీసులకు కూడా ఉచిత మాస్కులు పంపిణీ చేయనున్నట్టు కరోనా మహమ్మారికి సంబంధించిన ప్రభుత్వ కమిషనర్ డొమెనికో ఆర్కురీ తెలిపారు. లాక్‌డౌన్‌ను  సడలించనుండడంతో వేలాది మంది తిరిగి కార్యాలయాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ఇటలీలో ఇప్పటి వరకు 26 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. వీరిలో చాలామంది వృద్ధులే కావడం గమనార్హం. యూరప్‌లోనే అత్యధిక మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. ఇటలీలోనే అత్యంత బాధిత కరోనా ప్రాంతంగా మారిన లోంబార్డీలో 24 ఇళ్లు, మిలాన్‌లో ఒక ఇంటికి సంబంధించి అధికారులు విచారణ ప్రారంభించారు. ఇక్కడ 200 మంది మరణించారు.  

Updated Date - 2020-04-26T03:08:13+05:30 IST