ఆ భయంతోనే రాళ్లదాడి చేశారు: చౌహాన్

ABN , First Publish Date - 2020-12-10T21:33:34+05:30 IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన కాన్వాయ్‌పై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. నడ్డా కాన్వాయ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ వాహనంపై

ఆ భయంతోనే రాళ్లదాడి చేశారు: చౌహాన్

కోల్‌కతా: మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడికి దిగారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బజీపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. నడ్డా కారుపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అంతే కాకుండా బెంగాల్ కానీ దేశం కానీ ఈ చర్యను ఎంత మాత్రం సహించదని అన్నారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఇవే చివరి రోజులు. ఓటమి అంచున ఉన్నామని వారికి తెలిసిపోయింది. దీనిని జీర్ణించుకోలేకే దాడులకు దిగుతున్నారు. ఈరోజు నడ్డా కారుపై జరిగిన దాడి కూడా అదే కోవలోకి వస్తుంది. అయినప్పటికీ బీజేపీ ఏమాత్రం భయపడదు’’ అని చౌహాన్ అన్నారు.


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన కాన్వాయ్‌పై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. నడ్డా కాన్వాయ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ వాహనంపై కూడా ప్రత్యర్థులు రాళ్ల దాడికి దిగారు. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ దాడి జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించారు. కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో జరిగిన రాళ్ల దాడిన విజయ వర్గీయ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ దాడి తృణమూల్ కాంగ్రెస్ నేతల పనే అని బీజేపీ ఆరోపించింది.

Updated Date - 2020-12-10T21:33:34+05:30 IST