ఐటీ రిటర్న్స్ దాఖలు... ఇక ‘ఆన్‌లైన్’లో కూడా...

ABN , First Publish Date - 2020-07-19T19:47:52+05:30 IST

‘ఈ-ఫైలింగ్’ ద్వారా ఆదాయపన్నును చెల్లించే సౌకర్యాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) సిద్ధం చేసింది. పన్నుదారులకు ఇది పూర్తి వెసులుబాటేనని భావిస్తున్నారు. కాగా... ఈ క్రమంలో... కొత్తగా ‘26 ఏఎస్’ ఫారంను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా తమ వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడమే కాకుండా ఫిర్యాదులు కూడా చేయవచ్చని తెలిపింది.

ఐటీ రిటర్న్స్ దాఖలు... ఇక ‘ఆన్‌లైన్’లో కూడా...

హైదరాబాద్ : ‘ఈ-ఫైలింగ్’ ద్వారా ఆదాయపన్నును చెల్లించే సౌకర్యాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్(సీబీడీటీ) సిద్ధం చేసింది. పన్నుదారులకు ఇది పూర్తి వెసులుబాటేనని భావిస్తున్నారు. కాగా... ఈ క్రమంలో... కొత్తగా ‘26 ఏఎస్’ ఫారంను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా తమ వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడమే కాకుండా ఫిర్యాదులు కూడా చేయవచ్చని తెలిపింది.


ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులకు 26 ఏఎస్ ఫారం ఎంతో ఉపయోగపడుతుందని ప్రకటించింది. 26 ఏఎస్ ఫారం... సంస్థ అధికారిక వెబ్‌సైట్ లో ఉంటుందని అధికారులు తెలిపారు. ‘పాన్’ కార్డు ఆధారంగా ఈ  26 AS ఫారం నింపవచ్చని వెల్లడించారు. కిందటి ఆర్ధిక సంవత్సరం(2019-20) ఆదాయపు పన్ను రిటర్న్స్‌‌లను దాఖలు చేయడం కానీ, రివైజ్ చేయడానికి కానీ...  ఈ నెల 31వ తేదీ వరకు గడువుంది.


పన్ను చెల్లింపుదారులు తమ సౌలభ్యం, ప్రయోజనం కోసం ఈ ఫైల్లింగ్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇక మరోవైపు... పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసే గడువును కూడా వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-07-19T19:47:52+05:30 IST