చార్జిషీటులో ఏచూరి పేరు చేర్చడం సరికాదు: కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2020-09-14T08:17:16+05:30 IST

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరును ఢిల్లీ అల్లర్ల కేసుచార్జిషీటులో చేర్చడం సరికాదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఏచూరితో పాటు యోగేంద్ర యాదవ్‌,

చార్జిషీటులో ఏచూరి పేరు చేర్చడం సరికాదు: కాంగ్రెస్‌

17 నుంచి 24 వరకూ దేశవ్యాప్తంగా ఆందోళనలు: ఏచూరి 

నేడూ నిరసన ప్రదర్శనలు: నారాయణ 


న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరును ఢిల్లీ అల్లర్ల కేసుచార్జిషీటులో చేర్చడం సరికాదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఏచూరితో పాటు యోగేంద్ర యాదవ్‌, జయతి ఘోష్‌, అపూర్వానంద్‌పై అభియోగాలు మోపడం.. న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం ట్వీట్‌ చేశారు. సిగ్గుమాలిన, దుర్మార్గమైన చర్య అని కాంగ్రెస్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా మండిపడ్డారు.


కేంద్ర హోంశాఖ కుట్ర పన్నిందని సీపీఐ నేత సురవరం సుధాకర రెడ్డి ఆరోపించారు. ప్రధాన నిందితులైన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే, తదితరుల పేర్లు మీడియా ద్వారా వెల్లడైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 17 నుంచి 22 వరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తున్నటు   ఏచూరి తెలిపారు.


ఎన్డీఏ సర్కారు విధానాలు.. మైనారిటీల సమస్యలు పరిష్కారం, హక్కుల పరిరక్షణ, పౌరుల స్వేచ్ఛకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. 14న (సోమవారం) కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-14T08:17:16+05:30 IST