‘తృణముల్.. అత్త, మేనల్లుడు నడిపే కంపెనీలా తయారైంది’

ABN , First Publish Date - 2020-12-28T04:06:45+05:30 IST

తృణముల్ మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన సుబేందు అధికారి మమత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తృణముల్ ఇప్పుడో కంపెనీలా..

‘తృణముల్.. అత్త, మేనల్లుడు నడిపే కంపెనీలా తయారైంది’

కోల్‌కత్తా: తృణముల్ మాజీ మంత్రి, ఇటీవల బీజేపీలో చేరిన సుబేందు అధికారి మమత పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తృణముల్ ఇప్పుడో కంపెనీలా తయారైందని.. అత్త, మేనల్లుడి ఆధ్వర్యంలో అది నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తృణముల్‌ను ఎందుకు వీడారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. 21 ఏళ్లు తృణముల్‌లో భాగమైనందుకు సిగ్గుపడుతున్నానని సువేందు అధికారి ఇప్పటికే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తృణముల్‌లో క్రమశిక్షణ అంటూ ఉండదని, అందుకే ఆ కంపెనీ నుంచి బయటపడి.. సరైన రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చే సంప్రదాయానికి బీజేపీ శ్రీకారం చుట్టనుందని ఆయన చెప్పారు. Updated Date - 2020-12-28T04:06:45+05:30 IST