ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యానికి స్వాగతం

ABN , First Publish Date - 2020-05-18T07:58:45+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన కార్యకలాపాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇస్రో మాజీ చైర్మన్లు మాధవన్‌ నాయర్‌, కస్తూరి రంగన్‌లు స్వాగతించారు. ఇస్రో చరిత్రలో ఇది అత్యంత కీలకమైన...

ఇస్రోలో ప్రైవేటు భాగస్వామ్యానికి స్వాగతం

  • ఇస్రో మాజీ చైర్మన్లు మాధవన్‌ నాయర్‌, కస్తూరిరంగన్‌


బెంగళూరు, మే 17: భారత అంతరిక్ష పరిశోధన కార్యకలాపాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఇస్రో మాజీ చైర్మన్లు మాధవన్‌ నాయర్‌, కస్తూరి రంగన్‌లు స్వాగతించారు. ఇస్రో చరిత్రలో ఇది అత్యంత కీలకమైన ఘట్టమన్నారు. రాబోయే కాలంలో భారత్‌ అంతరిక్ష పరిశోధనలో మరో స్థాయి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో సున్నితమైన, వ్యూహాత్మక ప్రాంతాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఇస్రో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. 


Updated Date - 2020-05-18T07:58:45+05:30 IST