లాక్డౌన్.. జీశాట్-1 ప్రయోగం మళ్లీ వాయిదా వేసిన ఇస్రో
ABN , First Publish Date - 2020-04-09T02:58:05+05:30 IST
కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి అరికట్టేందకు ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో జీశాట్-1 ప్రయోగాన్ని ఇస్రో మరోసారి వాయిదా వేసినట్లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి అరికట్టేందకు ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో జీశాట్-1 ప్రయోగాన్ని ఇస్రో మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. జీఎస్ఎల్వీ-10 సహాయంతో కక్షలోకి ప్రవేశించాల్సిన ఈ శాటిలైట్‌ని తొలుత మార్చి 5వ తేదీన ప్రయోగించాలని భావించారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆ ప్రయోగం వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ కారణంగా ఈ ప్రయోగం మరోసారి వాయిదాపడింది
‘‘లాక్డౌన్ కారణంగా జీశాట్-1 ప్రయోగాన్ని ఇప్పుడు చేయలేము. ఎందుకంటే వివిధ విభాగాల్లో కనీసం వెయ్యి మంది పని చేస్తేనే ప్రయోగం విజయవంతం అవుతుంది’’ అని ఓ అధికారి తెలిపారు. అయితే మళ్లీ ప్రయోగం ఎప్పుడు జరుగుతుందనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.