ఇజ్రాయెల్‌లో రెండవ లాక్‌డౌన్ మరింత కఠినతరం

ABN , First Publish Date - 2020-09-25T00:15:05+05:30 IST

ఇజ్రాయెల్‌లో రెండవ లాక్‌డౌన్ మరింత కఠినతరం

ఇజ్రాయెల్‌లో రెండవ లాక్‌డౌన్ మరింత కఠినతరం

జెరూసలేం: కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున ఇజ్రాయెల్ గురువారం దేశవ్యాప్తంగా రెండవ లాక్‌డౌన్ మరింత కఠినతరం చేసింది. బహిరంగ మార్కెట్లతో సహా అన్ని అనవసరమైన వ్యాపారాలను మూసివేయాలని కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రార్థనలు, రాజకీయ ప్రదర్శనలు, బహిరంగ ప్రదేశాలకు పరిమితం చేయబడతాయని, 20 మందికి మించకూడదని స్పష్టం చేసింది. ఇంటి నుంచి కిలోమీటర్ (0.6 మైళ్ల) కన్నా ఎక్కువ ప్రయాణించకూడదని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. మొదటి లాక్‌డౌన్ నుంచి చాలా వ్యాపారాలు ఇంకా కోలుకోలేదు. ఇజ్రాయెల్ దేశంలో కరోనా వల్ల 1,335 మంది మృతి చెందారు. మొత్తం 200,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ప్రస్తుతం 50,000 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

Updated Date - 2020-09-25T00:15:05+05:30 IST