రూరల్‌ ఐసోలేషన్‌ వార్డులుగా రైల్‌ కోచ్‌లు

ABN , First Publish Date - 2020-04-05T05:55:50+05:30 IST

కరోనా వైర్‌సను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్నాయి. సామాజిక దూరం, లాక్‌డౌన్‌ పాటించడం కరోనా వ్యాప్తి కట్టడిలో కొన్ని...

రూరల్‌ ఐసోలేషన్‌ వార్డులుగా రైల్‌ కోచ్‌లు

కరోనా వైర్‌సను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్నాయి. సామాజిక దూరం, లాక్‌డౌన్‌ పాటించడం కరోనా వ్యాప్తి కట్టడిలో కొన్ని. ఇప్పటి వరకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే పొరపాటును కరోనా మూడో దశ లేదా నాలుగో దశకు చేరితే ఎదుర్కొనేందుకు కూడా భారతప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైద్య సౌకర్యాలు అంతగా అందుబాటులో లేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కరోనా సేవల కోసం ఇప్పటికే రైల్వే కోచ్‌లను సిద్ధం చేస్తోంది. ముందస్తు ఊహాగానంతో రైల్వే కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చే ప్రక్రియను ఆరంభించింది. అయిదు వేల కోచ్‌లను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీంతో ఎనభైవేల పడకలు అందుబాటులోకి వస్తాయిని అంచనా వేసింది.


ఏడువందలకు మించి జిల్లాలు ఉన్న మన దేశంలో 7300కు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అంటే జిల్లా ప్రధానకేంద్రంలోని ఆసుపత్రి కంటే సమీపానికి ఈ కోచ్‌లను తీసుకెళ్ళే సదుపాయం ఉంది. అలా ఈ ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో పురుడుపోసుకుంది. వెనువెంటనే రైల్వే ఐసోలేషన్‌ వార్డు ప్రొటోటై్‌పను సిద్ధం చేయడం, వాటి ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం చకచకా జరిగాయి.  కొన్ని ప్రాథమిక చర్యలతో  ప్రతి కేరేజ్‌ని పదహారు పడకలతో వైద్య సదుపాయాలు అందించేందుకు అనుగుణంగా మార్చవచ్చు. మొదటగా, పదహారు రైల్వే జోనుల్లోని అయిదువేల కోచ్‌లను మారుస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనభై వేల పడకలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్క దక్షిణ రైల్వే పరిధిలోనే 573 కోచ్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. మొత్తమ్మీద ఇరవై వేల కోచ్‌లు అంటే 3.2 లక్షల పడకలు సిద్ధమవుతాయి. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా వైద్య సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన ట్రక్కులను కూడా రైల్వే ద్వారానే పంపే ఏర్పాట్లు చేస్తోంది. కొద్ది గంటల్లో వెయ్యిపడకల ఆసుపత్రిని చైనా సిద్ధం చేస్తే కొన్ని రోజుల తేడాతో దేశవ్యాప్తంగా గ్రామీణులకు వైద్య సేవలు అందించేందుకు భారత్‌ సన్నద్ధమవుతూ ఉండటం విశేషం.

Updated Date - 2020-04-05T05:55:50+05:30 IST