బంగారం ధర పెరుగుదల... నిలవదా..? సెప్టెంబరు నాటికి భారీ షాక్..?

ABN , First Publish Date - 2020-07-28T19:43:09+05:30 IST

ఏరోజు చూసినా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. ఒక సందర్భంలో మయంలో రికార్డ్ స్థాయిలో... రూ. 51,184 కు కూడా చేరుకుంది. వెండి ధర కిలో రూ. 61,221 పలికింది. వారాలవారీగా చూస్తే కిందటి వారం బంగారం ధర నాలుగు శాతం పెరగగా, వెండి ఏకంగా పదిహేను శాతం పెరిగింది.

బంగారం ధర పెరుగుదల... నిలవదా..? సెప్టెంబరు నాటికి భారీ షాక్..?

హైదరాబాద్ : ఏరోజు చూసినా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతూనే ఉన్నాయి. ఒక సందర్భంలో మయంలో రికార్డ్  స్థాయిలో... రూ. 51,184 కు కూడా చేరుకుంది. వెండి ధర కిలో రూ. 61,221 పలికింది. వారాలవారీగా చూస్తే కిందటి వారం బంగారం ధర నాలుగు శాతం పెరగగా, వెండి ఏకంగా పదిహేను శాతం పెరిగింది. 


హైదరాబాద్‌లో ఈ వారం ప్రారంభంలో రూ. 51,300కు పైగా ఉన్న పసిడి ఇప్పుడు రూ. 53,200 పైకి చేరుకుంది. ఇక వెండి ఏకంగా కిలో రూ. 52,900 నుండి రూ. 61 వేల పైకి చేరుకుంది. రూ. ఎనిమిది వేలకు పైగా పెరిగింది. అంటే ఐదు రోజుల్లో ధర భారీగా పెరిగిందన్న మాట. కాగా... బంగారం ధరలు ఈ క్యాలెండర్ ఇయర్‍‌లో ఇప్పటి వరకు 30 శాతం వరకు పెరిగాయి. 


అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఔన్స్ బంగారం ధర 1,837 డాలర్ల నుండి 1,904 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 23 డాలర్లకు పరుగులు తీసింది. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో 1,900 మార్క్ దాటింది. అయితే... ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించడం గమనార్హం.  కాగా... ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బంగారం ధరలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు. 


సాయాన్యులు బంగారాన్ని కొనుగోలు చేసే పరిస్థితులు లేనప్పటికీ... ఇన్వెస్టర్లు మాత్రం పసిడి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రభావంతో పాటు ప్రస్తుతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు అంతకంతకు పడిపోతున్న విషయం తెలిసిందే. మొత్తంమీద ఈ పరిస్థితుల నేపధ్యంలో... బంగారం ధరలు మరింత పెరిగనుందని భావిస్తున్నారు. 


Updated Date - 2020-07-28T19:43:09+05:30 IST