మాస్కుకు బదులు ఫేస్ షీల్డ్ వాడొచ్చా..?

ABN , First Publish Date - 2020-09-01T21:36:31+05:30 IST

మాస్కుకు బదులు ఫేస్ షీల్డ్ వాడొచ్చా అంటే అస్సలు వద్దంటున్నారు వైద్య నిపుణులు. మాస్కులకు ఫేస్ షీల్డ్ ప్రత్యామ్నాయనం కాదని వారు స్పష్టం చేస్తున్నారు.

మాస్కుకు బదులు ఫేస్ షీల్డ్ వాడొచ్చా..?

న్యూఢిల్లీ: మాస్కుకు బదులు ఫేస్ షీల్డ్ వాడొచ్చా అంటే అస్సలు వద్దంటున్నారు వైద్య నిపుణులు. మాస్కులకు ఫేస్ షీల్డ్ ప్రత్యామ్నాయం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. వైరస్ కణాలున్న తుంపర్లు ఒకరి నుంచి మరొకరిపై పడకుండా ఫేస్ షీల్డ్స్ పూర్తి స్థాయిలో ఆపగలవా లేదా అనే విషయాన్ని తేల్చే అధ్యయనాలు ప్రస్తుతం అందుబాటులో లేవని వారు గుర్తు చేస్తున్నారు. 


అయితే కరోనా నుంచి అదనపు రక్షణ కోరుకునే వారు నిరభ్యంతరంగా మాస్కుతో పాటూ ఫేస్ షీల్డ్ కూడా ధరించవచ్చని చెబుతున్నారు. ఇవి కళ్లకు కూడా రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు. అంతే కాకుండా.. పదే పదే చేతితో ముఖాన్ని తాకడం కూడా ఫేస్ షీల్డ్ కారణంగా తగ్గుతుందని వారు చెబుతున్నారు. ఇక.. ముఖాన్ని చెవుల వరకూ కప్పి ఉంచే ఫేస్ షీల్డ్సే కరోనాను అడ్డుకోలవని వారు స్పష్టం చేస్తున్నారు. రీయూజబుల్ షీల్డులు(పలు మార్లు వినియోగించే) వాడుతున్నట్టైతే.. వాటిని ఉపయోగించిన అనంతరం తప్పనిసరిగా వాటిని నీటితో శుభ్రపరుచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 


Updated Date - 2020-09-01T21:36:31+05:30 IST