చైనా... ‘సైబర్ వార్’కు సిద్ధమైందా ?

ABN , First Publish Date - 2020-09-18T23:23:49+05:30 IST

సైబర్ వార్‌కు చైనా సన్నద్ధంగా ఉందా ? తన కనుసన్నల్లో పనిచేసే వేలాది మంది హ్యాకర్లను ప్రపంచంలోని టాప్ కార్పోరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారా ? ఈ ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానమే వినవస్తోంది. డ్రాగన్ టికేస్తే... ప్రపంచ ఆర్థికవ్యవస్థే చిన్నాభిన్నం కావడం ఖాయమని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

చైనా... ‘సైబర్ వార్’కు సిద్ధమైందా ?

వాషింగ్టన్ : సైబర్ వార్‌కు చైనా సన్నద్ధంగా ఉందా ? తన కనుసన్నల్లో పనిచేసే వేలాది మంది హ్యాకర్లను ప్రపంచంలోని టాప్ కార్పోరేట్ కంపెనీల్లో పనిచేస్తున్నారా ? ఈ ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానమే వినవస్తోంది. డ్రాగన్ టికేస్తే... ప్రపంచ ఆర్థికవ్యవస్థే చిన్నాభిన్నం కావడం ఖాయమని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.


చైనీస్ హ్యాకర్స్ ప్రపంచంలోని వందకు పైగా దిగ్గజ కార్పోరేట్ సంస్థల్లో చొరబడి పనిచేస్తున్నారని,  డ్రాగన్ ప్రభుత్వం వ్యూహాన్ని రూపొందించడానికి... వారంతా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని విననవస్తోంది. అమెరికా న్యాయ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.ఇంటెలిజెన్స్, నెట్‌వర్క్ హైజాకింగ్, బ్లాక్‌మెయిలింగ్ ద్వారా... టాప్ పొజిషన్స్ లో ఉన్న వారిని బెదిరించి సమాచారాన్ని దొంగిలించడం దీని వెనుక చైనా హ్యాకర్ల ఉద్దేశ్యం. 


ఈ సైబర్ దాడి ద్వారా చైనా తన ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చడానికి, ప్రపంచ సూపర్ పవర్‌గా మారడానికి ప్రయత్నిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. డిప్యూటీ అటార్నీ జనరల్ జాఫ్రే ఎ. రోచెన్ మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ వ్యవస్థపై ఉద్దేశపూర్వకంగా చైనా సైబర్ దాడులకు కారణమవుతోందని పేర్కొంది. హ్యాకర్లకు చైనా పూర్తి దన్నుగా నిలుస్తోందని పేర్కొంది. 


టాప్ కంపెనీల్లో పనిచేస్తున్న ఈ హ్యాకర్లందరికీ చైనాతో సంబంధాలున్నాయని, అంతేకాకుండా... వీరంతా ప్రపంచవ్యాప్తంగా హ్యాకింగ్, దొంగతనాలకు చైనా నుండి ఉచిత లైసెన్స్ పొందారని కొలంబియా జిల్లాకు చెందిన న్యాయవాది మైఖేల్ ఆర్. సెర్విన్ ఆరోపించారు.

Updated Date - 2020-09-18T23:23:49+05:30 IST