కరోనా సోకడంతో ఆత్మహత్య చేసుకున్న కడాయి హల్వా యజమాని

ABN , First Publish Date - 2020-06-26T00:18:23+05:30 IST

కరోనా వ్యాధి సోకడంతో మనస్తాపానికి గురైన తమిళనాడులోని ప్రసిద్ధ తిరుల్వేలి ఇరుట్టు కడాయి హల్వా

కరోనా సోకడంతో ఆత్మహత్య చేసుకున్న కడాయి హల్వా యజమాని

చెన్నై: కరోనా వైరస్ సోకడంతో మనస్తాపానికి గురైన తమిళనాడులోని ప్రసిద్ధ తిరునల్వేలి ఇరుట్టు కడాయి హల్వా యజమాని హరిసింగ్ (70) నేడు (గురువారం) ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే ఆసుపత్రిలో చేరిన ఆయన అంతలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యూరినరీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న హరిసింగ్ మంగళవారం ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా గురువారం వచ్చిన ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన అనూహ్యంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.  కాగా, ఆయన అల్లుడు కూడా మహమ్మారి బారిన పడినట్టు తెలుస్తోంది. ఇరుట్టు కడాయి హల్వా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వందేళ్ల క్రితమే ఈ దుకాణాన్ని స్థాపించారు. 

Updated Date - 2020-06-26T00:18:23+05:30 IST