న్యాయం చేయాలని చూడటం లేదు... రాహుల్ రాజకీయం చేస్తున్నారు : స్మృతి ఇరానీ

ABN , First Publish Date - 2020-10-03T19:36:09+05:30 IST

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్

న్యాయం చేయాలని చూడటం లేదు... రాహుల్ రాజకీయం చేస్తున్నారు : స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న జిమ్మిక్కులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వారికి బాగా తెలుసని, అందుకే 2019 లో బీజేపీకి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ నేతనూ ఎవరూ అడ్డుకోలేరని, అయితే.. హత్రాస్ బాధిత కుటుంబ పరామర్శ విషయంలో మాత్రం రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. బాధిత  కుటుంబానికి న్యాయం చేయాలన్న ఆకాంక్ష కాంగ్రెస్‌కు ఏ కోశానా లేదని, కేవలం రాజకీయాలు చేస్తున్నారని స్మృతి ఇరానీ  ధ్వజమెత్తారు. 

Updated Date - 2020-10-03T19:36:09+05:30 IST