కరోనాతో 138 మంది వైద్య నిపుణులు మృతి

ABN , First Publish Date - 2020-07-22T21:50:37+05:30 IST

కరోనాతో 138 మంది వైద్య నిపుణులు మృతి

కరోనాతో 138 మంది వైద్య నిపుణులు మృతి

ఇరాన్: కరోనా వైరస్ యావత్తు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ ఇరాన్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ లో కరోనా వైరస్ వల్ల 138 మంది వైద్య నిపుణులు చనిపోయారని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతూ ఇప్పటివరకు 138 మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరణించారని ఇరాన్ సర్కారు పేర్కొంది. మరణించిన వారిలో 90 మంది వైద్యులు, 28 మంది నర్సులు ఉన్నారని ఇరాన్ ఆరోగ్య సంరక్షణ నిపుణుల రెగ్యులేటరీ బాడీ ప్రతినిధి వెల్లడించారు.


Updated Date - 2020-07-22T21:50:37+05:30 IST