ఇరాన్‌లో 4 వేలకు చేరువైన కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-04-08T01:08:11+05:30 IST

ఇరాన్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొత్తంగా 62 వేల కరోనా నిర్ధారిత కేసులు

ఇరాన్‌లో 4 వేలకు చేరువైన కరోనా మరణాలు

టెహ్రాన్: ఇరాన్‌లో కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మొత్తంగా 62 వేల కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, మరణాలు నాలుగు వేలకు చేరువవుతున్నాయి. అయితే, నిర్ధారిత కేసుల సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత రాత్రి 133 మంది వైరస్ బారినపడి మృతి చెందినట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి కియానుష్ జహాన్‌పూర్‌ను ఉటంకిస్తూ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. తాజా మృతులతో మొత్తం మరణాల సంఖ్య 3,872కు పెరిగినట్టు పేర్కొంది. వైరస్  సోకిన వారిలో 4 వేల మంది రోగుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, 2,089 కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 62,589కి చేరుకున్నట్టు జహాన్‌పూర్ వివరించారు.  

Read more