3500 మందికి అదనపు సాయం: ఐపీఆర్‌ఎస్
ABN , First Publish Date - 2020-05-17T09:14:35+05:30 IST
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన 3500 మంది సభ్యులకు అదనపు సాయం

ముంబై, మే 16 : కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన 3500 మంది సభ్యులకు అదనపు సాయం చేస్తామని భారతీయ కళాకారుల హక్కుల సంస్థ (ఐపీఆర్‌ఎస్) ప్రకటించింది. సంగీత సమాజంలోని రచయితలు, కంపోజర్లకు ఈ సాయం అందిస్తామని ఐపీఆర్‌ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. మార్చి 24న కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించినప్పుడు కూడా తన సభ్యులకు అత్యవసర నిధిని ఐపీఆర్‌ఎస్ ప్రకటించింది. ఆపత్కాలంలో సంగీత సమాజానికి సాయం చేయడమే ఐపీఆర్‌ఎస్ ఉద్దేశమని, ఇప్పుడా సమాజం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోందని ఆ సంస్థ చైర్మన్, ప్రముఖ పాటల రచయిత జావెద్ అక్తర్ ట్వీట్ చేశారు.