ఒలింపిక్స్‌కు యథావిథిగా సిద్ధం కండి: ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ

ABN , First Publish Date - 2020-03-05T02:01:42+05:30 IST

ఇంటర్నెషన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిండెంట్ థామస్ బాఖ్ కీలక ప్రకటన చేశారు.

ఒలింపిక్స్‌కు యథావిథిగా సిద్ధం కండి: ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ

న్యూఢిల్లీ: జపాన్ రాజధాని టోక్యోలో ఈ ఏడాది ఒలింపిక్స్ జరగనున్నాయి. కానీ ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసరడంతో అసలు ఒలింపిక్స్ జరుగుతాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒలింపిక్స్‌ను వాయిదా వేసే అవకాశం తమకు ఉందంటూ జపాన్ మంత్రి చేసిన ప్రకటనతో ఈ ఆందోళన మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిండెంట్ థామస్ బాఖ్ కీలక ప్రకటన చేశారు. క్రీడాకారులందరూ ఒలింపిక్స్ కోసం మరింత ఉత్సాహంగా తమ ట్రైనింగ్ కొనసాగించాలని ఆయన కోరారు. ఈ విషయంలో వివిధ దేశాల ఒలింపిక్ కమిటీలకు, క్రీడాకారులకు తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. కానీ ఒలింపిక్స్ వాయిదాపై మాత్రం ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Updated Date - 2020-03-05T02:01:42+05:30 IST