తండ్రికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి ఐఓఏ చీఫ్

ABN , First Publish Date - 2020-05-30T00:16:26+05:30 IST

తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్లు భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) చీఫ్ నరీందర్ బాత్రా ప్రకటించారు.

తండ్రికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి ఐఓఏ చీఫ్

న్యూఢిల్లీ: తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్లు భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) చీఫ్ నరీందర్ బాత్రా ప్రకటించారు. బాత్రా తండ్రి, ఇద్దరు అటెండెంట్లు ఇటీవలే కరోనా పాజిటివ్‌గా తేలారు. ఈ క్రమంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాత్రా వెల్లడించారు. అలాగే కొందరు సెక్యూరిటీ గార్డులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. ఇటీవలే ఐఓఏ ఆఫీసుకు వచ్చిన మరో ఉద్యోగికి కూడా కరోనా సోకిందట. ఈ నేపథ్యంలోనే తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్తున్నట్లు బాత్రా ప్రకటించారు. కాగా, ప్రస్తుతం అత్యధిక కరోనాక కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు దేవంలో 1,65,700కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-05-30T00:16:26+05:30 IST