జరభద్రం..కరోనా లేఖలొస్తున్నాయి!
ABN , First Publish Date - 2020-11-21T07:03:21+05:30 IST
రాజకీయ నాయకులు, సెలబ్రిటీలే లక్ష్యంగా కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా కరోనా వ్యాప్తికి కుట్రలు పన్నారని, ఇందుకోసం పార్శిళ్లు, లేఖలను ఆయుధంగా మలచుకున్నారని ఇంటర్‌పోల్ హెచ్చరికలు

దుండగుల దుశ్చర్యలపై ఇంటర్‌పోల్ అలర్ట్
న్యూఢిల్లీ, నవంబరు 20: రాజకీయ నాయకులు, సెలబ్రిటీలే లక్ష్యంగా కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా కరోనా వ్యాప్తికి కుట్రలు పన్నారని, ఇందుకోసం పార్శిళ్లు, లేఖలను ఆయుధంగా మలచుకున్నారని ఇంటర్‌పోల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆయా లేఖలు/పార్శిళ్ల ఉపరితలంపై ఉమ్మడం, దగ్గడం చేస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు భారత్ సహా.. 194 సభ్యదేశాలను అప్రమత్తం చేసింది. పోలీసు, సీబీఐ, సీఐడీ వంటి చట్ట పరిరక్షణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరికొన్ని సందర్భాల్లో కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా పోలీసులు, ఇతర తనిఖీ, నిఘా అధికారులు, వైద్య, అత్యవసర సిబ్బంది ముఖంపై ఉమ్మడం, దగ్గడం చేస్తున్నారని ఇంటర్‌పోల్ తెలిపింది.