హుగ్లీలో ఇంటర్నెట్ సేవల తాత్కాలిక నిలిపివేత

ABN , First Publish Date - 2020-05-13T20:42:09+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు.

హుగ్లీలో ఇంటర్నెట్ సేవల తాత్కాలిక నిలిపివేత

హుగ్లీ : పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. చందెన్నగోర్, శ్రీరామ్‌పోర్ సబ్ డివిజన్లలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. కొందరు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటువంటి వార్తలను ప్రచారం చేయడం వల్ల ఈ ప్రాంతంలో హింస చెలరేగే అవకాశం ఉందనే కారణంతో యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. 


హుగ్లీ జిల్లా మేజిస్ట్రేట్ యెలుచూరి రత్నాకర రావు బుధవారం మాట్లాడుతూ చందెన్నగోర్, శ్రీరామ్‌పోర్ సబ్ డివిజన్లలో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపేసినట్లు తెలిపారు. కొందరు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నకిలీ వార్తల ప్రచారం వల్ల ఈ ప్రాంతంలో హింస చెలరేగే అవకాశం ఉందనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 


చందెన్నగోర్, శ్రీరామ్‌పోర్ సబ్ డివిజన్లలో కొందరు దుండగులు సామాజిక మాధ్యమాలను దుర్వినియోగపరుస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా వదంతులను ప్రచారం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. Read more