ఆగస్టు నుంచి అంతర్జాతీయ విమాన సేవలు

ABN , First Publish Date - 2020-07-12T08:05:54+05:30 IST

ఆగస్టులో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ద్వైపాక్షిక ఒప్పందం కింద అమెరికా, ఈయూ, గల్ఫ్‌ దేశాలకు మాత్రమే ప్రస్తుతానికి అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభించేందుకు...

ఆగస్టు నుంచి అంతర్జాతీయ విమాన సేవలు

న్యూఢిల్లీ, జూలై 11: ఆగస్టులో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ద్వైపాక్షిక ఒప్పందం కింద అమెరికా, ఈయూ, గల్ఫ్‌ దేశాలకు మాత్రమే ప్రస్తుతానికి అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొవిడ్‌ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ విమాన సేవలను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు అమెరికా, కెనడా, యూరోపియన్‌ దేశాలకు, గల్ఫ్‌కు విమానాలు నడిపే విషయమై ద్వైపాక్షికంగా చర్చిస్తున్నామని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) చైర్మన్‌ అరవింద్‌ సింగ్‌ తెలిపారు. వాణిజ్యపరంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్‌ ఇటీవల ఈనెల 31వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. మరోవైపు వందేభారత్‌ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తెచ్చే ప్రక్రియ కూడా ఈనెలాఖరుకు పూర్తి కానున్నది. 


Updated Date - 2020-07-12T08:05:54+05:30 IST