సాహో... దిగంతికా బోస్‌

ABN , First Publish Date - 2020-04-28T06:18:04+05:30 IST

కరోనాపై పోరుకు బాలలు సైతం మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌ పట్టణానికి చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని దిగంతికా బోస్‌ రూపొందించిన...

సాహో... దిగంతికా బోస్‌

  • వైర్‌సను చంపే మాస్క్‌ తయారుచేసిన ఇంటర్‌ విద్యార్థిని

బుర్ద్వాన్‌, ఏప్రిల్‌ 27: కరోనాపై పోరుకు బాలలు సైతం మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌ పట్టణానికి చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థిని దిగంతికా బోస్‌ రూపొందించిన ఒక మాస్క్‌ నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌(ఎన్‌ఐఎ్‌ఫ)ను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ తరహా మాస్క్‌లను ఉత్పత్తికి సమ్మతిని కోరుతూ ఎన్‌ఐఎ్‌ఫకు చెందిన డాక్టర్‌ వివేక్‌ కుమార్‌ నుంచి దిగంతికాకు ఉత్తరం అందింది. సాధారణంగా మాస్క్‌లు వైరస్‌ సోకకుండా నియంత్రిస్తాయి. కానీ దిగంతికా డిజైన్‌ చేసిన మాస్క్‌ మాత్రం వైర్‌సను అడ్డుకోవడంతోపాటు దాన్ని చంపేస్తుంది కూడా. ఇందులో రెండు పొరలు ఉంటాయి. వీటిల్లో రెండు వాల్వ్స్‌, ఫిల్టర్లు ఉంటాయి. ఇది కొవిడ్‌ రోగి నుంచి వెలువడే ప్రతి వైర్‌సను నిచ్ఛ్వాస సమయంలో చంపేస్తుంది. ఇది ప్రధానంగా కరోనా రోగులకు చికిత్స చేసే వైద్యులకు ఉపయోగపడుతుంది.


Updated Date - 2020-04-28T06:18:04+05:30 IST