ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులు పెరిగారు

ABN , First Publish Date - 2020-07-20T02:40:17+05:30 IST

కరోనా వైరస్ నేపధ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు ముందే ఉద్దేశ్యపూర్వక పన్నుఎగవేతదారులు పెరిగారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సంస్థ లేదా వ్యక్తికి... చెల్లించగలిగే సామర్థ్యమున్నప్పటికీ చెల్లింపులు జరపడం లేదని వెల్లడించారు. రుణదాతలు మార్చి క్వార్టర్‌లో రూ. 24,765.5 కోట్ల రికవరీ కోసం 1,251 కేసులను నమోదు చేసినట్లు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ డేటా వెల్లడిస్తోంది.

ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతదారులు పెరిగారు

ముంబై : కరోనా వైరస్ నేపధ్యంలో విధించిన లాక్‌డౌన్‌కు ముందే ఉద్దేశ్యపూర్వక పన్నుఎగవేతదారులు పెరిగారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సంస్థ లేదా వ్యక్తికి... చెల్లించగలిగే సామర్థ్యమున్నప్పటికీ చెల్లింపులు జరపడం లేదని వెల్లడించారు. రుణదాతలు మార్చి క్వార్టర్‌లో రూ. 24,765.5 కోట్ల రికవరీ కోసం 1,251 కేసులను నమోదు చేసినట్లు ట్రాన్స్‌యూనియన్ సిబిల్ డేటా వెల్లడిస్తోంది.


రూ. కోటి కంటే ఎక్కువ బకాయిలున్నవారిని డిఫాల్టర్లుగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు కరోనా వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఛిన్నాభిన్నం కావడంతో డిఫాల్టర్లు పెరుగుతారని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కరోనా, లాక్‌న్ దెబ్బతో వ్యాపారాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలు తెరుచుకున్నప్పటికి డిమాండ్ లేమి కనిపిస్తోంది. ఇది వ్యాపారులు, వ్యక్తుల బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యంపై ప్రభావం చూపింది.


మొత్తం ఉద్దేశ్యపూర్వ ఎగవేతదారుల్లో 82 శాతం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు సంబంధించిన వారే ఉన్నారు.  ప్రయివేటు సెక్టార్ బ్యాంకుల వాటా 17.7 శాతంగా ఉండగా, మిగతా మొత్తం విదేశీ బ్యాంకులకు చెందినవారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్దేశ్యపూర్వక రుణాల ఎగవేతలు రూ. 20,310 కోట్లు, ప్రయివేటురంగ బ్యాంకులవి రూ. 4,378 కోట్లు, విదేశీ బ్యాంకులకు సంబంధించిన ఎగవేతలు రూ. 76 కోట్లుగా ఉన్నాయి. 


మందగమనం దెబ్బ.. . కరోనా మరో దెబ్బ... ఇప్పటికే మందగమనం వ్యాపారవృద్ధిని సింగిల్ డిజిట్‌కు పరిమితం చేసిందని, కరోనా-లాక్‌డౌన్ కారణంగా ఈ ప్రభావం మరింత భారీగా పడిందని చెబుతున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్‌బీఐ మారటోరియం వెసులుబాటును కల్పించింది. అన్‌లాక్ ప్రారంభమయ్యాక ఇప్పటికే కొన్ని సంస్థలు లేదా వ్యక్తులు మారటోరియం నుండి తప్పుకోవడం జరిగింది. 


మారటోరియం ఆప్షన్ వినియోగించుకుంటున్న వారిలో ఐదు శాతం నుండి పది శాతం మంది రుణాలు రిస్క్‌గా భావిస్తున్నారు. బ్యాడ్ లోన్స్, ఎన్పీఏలు ఎంఎస్ఎంఈలు సహా వివిధ సెగ్మెంట్‌లలో బ్యాంకుల బ్యాడ్ లోన్స్ లేదా ఎన్పీఏలు పెరగవచ్చునని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ జూన్ 25 నాటి నివేదికలో తెలిపింది. మారటోరియం కారణంగా గ్రాస్ నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో పెరగకుండా ఉంటాయని తెలిపింది. కరోనా కారణంగా ఎస్ఎంఈ, రిటైల్, వ్యక్తిగత రుణాలు సహా వివిధ సెగ్మెంట్‌లలో పెరుగుదల ఉండవచ్చునని పేర్కొంది.


Updated Date - 2020-07-20T02:40:17+05:30 IST