కరోనా మరణాల్లో వెంటనే బీమా సెటిల్మెంట్
ABN , First Publish Date - 2020-04-07T07:53:00+05:30 IST
కరోనా మరణాలు సంభవించినప్పుడు బీమా క్లెయిమ్‌లను వెంటనే సెటిల్ చేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సూచించింది. ఈ మేరకు సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బీమా సంస్థలకు ఆదేశాలు...

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: కరోనా మరణాలు సంభవించినప్పుడు బీమా క్లెయిమ్‌లను వెంటనే సెటిల్ చేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సూచించింది. ఈ మేరకు సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బీమా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసుల విషయంలో మృతుడి కుటుంబీకులను ఆధారాల కోసం ఇబ్బందులకు గురిచేయకూడదని కోరింది. కరోనా మరణాల విషయంలో బీమా సంస్థలు మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తుండటం.. సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలను జారీ చేశామని పేర్కొంది. బీమా సంస్థలు ఈ సమాచారాన్ని పాలసీదారులకు చేరవేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ఎస్.ఎన్.భట్టాచార్య ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు.