భూమికి బదులు మౌలిక సదుపాయాలు
ABN , First Publish Date - 2020-10-27T06:41:19+05:30 IST
ప్రజా ప్రయోజనార్థం చేపట్టే పనుల కోసం రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తీసుకుంటే..

న్యూఢిల్లీ, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రజా ప్రయోజనార్థం చేపట్టే పనుల కోసం రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తీసుకుంటే.. ఇకపై దానికి సమానమైన విలువగల భూములే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ భూబదలాయింపులకు సంబంధించి కొత్త నిబంధనలను ఆమోదించింది.
వాటి ప్రకారం భూమి విలువకు సమానంగా రక్షణ శాఖకు మౌలిక సదుపాయాలను కల్పించవచ్చు. సదరు భూమి విలువను తమ శాఖలో కార్యాలయాలు, బ్యారక్‌లు, ఇతర అభివృద్ధి పనుల కోసం వెచ్చించవచ్చని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ వెల్లడించారు. కాగా, కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఉండే రక్షణ శాఖ భూముల విలువను స్థానిక మిలటరీ అధికారి నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుంది.