గవర్నర్ ప్రవర్తనపై మోదీతో మాట్లాడా: గెహ్లాట్
ABN , First Publish Date - 2020-07-27T21:03:27+05:30 IST
గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ప్రవర్తనపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్టు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్..

జైపూర్: గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా ప్రవర్తనపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్టు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తెలిపారు. సోమవారంనాడు ఫైర్‌మాంట్ హోటల్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీతో ఆదివారంనాడు తాను మాట్లాడానని, గవర్నర్ ప్రవర్తన గురించి తెలియజేశానని అన్నారు. ఏడు రోజుల క్రితం తాను గవర్నర్‌కు రాసిన లేఖ గురించి కూడా వివరించినట్టు చెప్పారు.
దీనికి ముందు, హోటల్ ఆవరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి 'ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..రాజ్యాంగాన్ని కాపాడండి' నినాదంతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. గెహ్లాట్, పార్టీ నేతలు ఇందులో పాల్గొన్నారు. గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు బయటపడి, రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పటి నుంచి సుమారు రెండు వారాలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హోటల్‌లోనే ఉంటున్నారు.