ఇండోర్‌లో కొత్తగా 84 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-30T01:06:21+05:30 IST

దేశాన్ని కరోనా భూతం వణికిస్తోంది. రోజురోజుకూ ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.

ఇండోర్‌లో కొత్తగా 84 కరోనా కేసులు

ఇండోర్: దేశాన్ని కరోనా భూతం వణికిస్తోంది. రోజురోజుకూ ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఇండోర్ సిటీలో గడిచిన 24గంటల్లో కొత్తగా 84 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తమ్మీద ఇక్కడ నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,344కు చేరిందని ఇండోర్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ అధికారి ప్రవీణ్ జాడియా శుక్రవారం తెలియజేశారు. అలాగే కొత్తగా నలుగురు కరోనా బాధితులు మరణించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఇండోర్‌లో సంభవించిన కరోనా మరణాల సంఖ్య 126కు చేరింది.

Updated Date - 2020-05-30T01:06:21+05:30 IST