వైద్యులపై దాడి చేసిన ప్రాంతంలో 10 పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-05T16:16:55+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కరోనా బాధితులను పరీక్షించేందుకు వెళ్ళిన వైద్యుల బృందంపై రాళ్ళు రువ్విన విషయం విదితమే. ఇప్పుడు అదే ప్రాంతంలో...

వైద్యులపై దాడి చేసిన ప్రాంతంలో 10  పాజిటివ్ కేసులు

ఇండోర్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కరోనా బాధితులను పరీక్షించేందుకు వెళ్ళిన వైద్యుల బృందంపై రాళ్ళు రువ్విన విషయం విదితమే. ఇప్పుడు అదే ప్రాంతంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 1 న వైద్య బృందంపై అల్లరి మూక  రాళ్ళు రువ్వింది. తాజాగా ఆరోగ్యశాఖ విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం ఏప్రిల్ 3, 4 తేదీలలో ఈ ప్రాంతాలలో 16 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో  5 మంది పురుషులు, 5 మంది మహిళలు ఉన్నారు. వారి వయస్సు 29 సంవత్సరాల నుండి 60 ఏళ్ళ మధ్య ఉంటుంది. ఇండోర్‌ లో ఏప్రిల్ 1 న ఆరోగ్య శాఖ బృందంపై జరిగిన దాడి దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

Updated Date - 2020-04-05T16:16:55+05:30 IST