కోవిడ్-19పై పోరు... బ్రిటన్‌కు ముంబై నుంచి పారాసిటమాల్ మాత్రలు...

ABN , First Publish Date - 2020-04-14T21:27:29+05:30 IST

యుద్ధం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా బ్రిటన్‌కు

కోవిడ్-19పై పోరు... బ్రిటన్‌కు ముంబై నుంచి పారాసిటమాల్ మాత్రలు...

ముంబై : కోవిడ్-19పై యుద్ధం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా బ్రిటన్‌కు పారాసిటమాల్ మాత్రలను పంపించారు. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇండోకో రెమెడీస్ 11.7 లక్షల పారాసిటమాల్ మాత్రలను పంపించింది. ఇండోకో రెమెడీస్ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ వివరాలను తెలిపింది. 


కోవిడ్-19పై పోరాటంలో భాగంగా బ్రిటన్‌కు పారాసిటమాల్ మాత్రలను ఎగుమతి చేయాలన్న కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టిందని, దీనిలో తాము భాగస్వామి అయ్యామని ఇండోకో రెమెడీస్ తెలిపింది. 


మొదటి విడతగా 11.7 లక్షల పారాసిటమాల్ మాత్రలను గోవా విమానాశ్రయం నుంచి ఈ నెల 12న పంపించినట్లు తెలిపింది. మొత్తం 4.48 కోట్ల పారాసిటమాల్ మాత్రలను విమానాల ద్వారా పంపించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని పేర్కొంది. 


మిగిలిన పారాసిటమాల్ మాత్రలు కూడా సిద్ధంగా ఉన్నాయని, వాటిని విమానాలు అందుబాటులో ఉండటాన్నిబట్టి బ్రిటన్‌కు ఎగుమతి చేస్తామని తెలిపింది. 


Updated Date - 2020-04-14T21:27:29+05:30 IST