కరోనా వేళ ఇండిగో కొత్త స్కీం.. ఒకే వ్యక్తికి రెండు సీట్లు బుకింగ్ చేసుకునే అవకాశం

ABN , First Publish Date - 2020-07-18T05:50:01+05:30 IST

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రయాణాలు చేసే సమయంలో భౌతిక దూరం పాటించాలని...

కరోనా వేళ ఇండిగో కొత్త స్కీం.. ఒకే వ్యక్తికి రెండు సీట్లు బుకింగ్ చేసుకునే అవకాశం

న్యూఢిల్లీ: కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రయాణాలు చేసే సమయంలో భౌతిక దూరం పాటించాలని.. ప్రయాణం చేసే వారు పక్కపక్కనే కూర్చోవద్దని, ఓ సీటు వదిలేసి కూర్చోవాలని సూచనలు చేస్తున్న ఈ తరుణంలో ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఒకే ప్రయాణికుడు రెండు టికెట్లు బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.


ఉదాహరణకు.. ఒక వ్యక్తి కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించాలని భావించి.. విమానంలో టికెట్ బుక్ చేసుకునే సమయంలో తన పక్క సీటును కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే.. అదనంగా బుక్ చేసుకోవాలంటే మరో టికెట్‌ డబ్బు చెల్లించాల్సిందే. అయితే.. రెండో సీటు బుకింగ్‌పై 25 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. జూలై 24 నుంచి ఇండిగోలో ప్రయాణం చేసేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సదరు విమానయాన సంస్థ పేర్కొంది. ఈ స్కీమ్ కేవలం ఇండిగో వెబ్‌సైట్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న వారికే వర్తిస్తుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. 

Updated Date - 2020-07-18T05:50:01+05:30 IST