ప్రయాణికుడు రెండు సీట్లు బుక్ చేసుకోవచ్చు
ABN , First Publish Date - 2020-07-18T07:30:16+05:30 IST
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విమానంలో భౌతిక దూరం పాటించేందుకు ప్రయాణికుడు రెండు సీట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని...

భౌతిక దూరం కోసం ఇండిగో సదుపాయం
న్యూఢిల్లీ, జూలై 17: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విమానంలో భౌతిక దూరం పాటించేందుకు ప్రయాణికుడు రెండు సీట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని ఇండిగో శుక్రవారం ప్రారంభించింది. ఈనెల 24 నుంచి ఈ ఆఫర్ అమల్లోకి రానుంది. రెండో సీటుకు చార్జీలు మొదటి సీటులో 25 శాతం వసూలు చేస్తామని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ఇండిగో వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకుంటనే ఈ ఆఫర్ వర్తిస్తుందని, ట్రావెల్ పోర్టల్స్, ఇండిగో కాల్ సెంటర్లు, విమానాశ్రయ కౌంటర్ల ద్వారా ప్రయాణికులు ఈ సదుపాయాన్ని పొందలేరని వెల్లడించింది. విమానాల్లో ప్రయాణికులు భౌతికదూరం పాటించకపోవడమనేది ఆందోళనకరంగా మారినట్లు జూన్ 20 నుంచి 28 వరకు తాము నిర్వహించిన సర్వేలో తేలిందని, అందువల్లే ఈ సదుపాయం తీసుకొచ్చామని పేర్కొంది.