లిబియాలో అపహరణకు గురైన ఏడుగురికి విముక్తి

ABN , First Publish Date - 2020-10-13T08:10:42+05:30 IST

గత నెలలో లిబియాలో అపహరణకు గురైన ఏడుగురు భారతీయులకు విముక్తి లభించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) సోమవారం వెల్లడించింది...

లిబియాలో అపహరణకు గురైన ఏడుగురికి విముక్తి

న్యూఢిల్లీ, అక్టోబరు 12: గత నెలలో లిబియాలో అపహరణకు గురైన ఏడుగురు భారతీయులకు విముక్తి లభించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) సోమవారం వెల్లడించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ఉన్నట్టు పేర్కొంది. భారత్‌కు వెళ్లడానికి వీరు సెప్టెంబరు 14న ట్రిపోలీ విమానాశ్రయానికి వెళుతున్న తరుణంలో మార్గమధ్యలో అపహరణకు గురయ్యారు. అయితే వీరంతా ఆదివారం విడుదలయ్యారని ఎంఈఏ పేర్కొంది. వీరంతా నిర్మాణ, ఆయిల్‌ ఫీల్డ్‌ సప్లయీస్‌ కంపెనీలో పని చేస్తుండే వారని ఎంఈఏ అధికారప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గత వారం తెలిపారు. వీరు భారత్‌కు తిరిగి వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఎంఈఏ పేర్కొంది. 


Updated Date - 2020-10-13T08:10:42+05:30 IST